FAQs


Q1.How is merit list prepared for any Exam?
ప్రశ్న : ఏ పరీక్షకైనా మెరిట్ లిస్టును ఎలా తయారు చేస్తారు?

Ans. Based on the marks obtained in the Exam, merit list is prepared. It contains names of the candidates in the order of marks obtained by them. If two or more candidates have secured same marks, Date of Birth (DOB) decides their seniority, with elder candidate being given higher merit.

జవాబు: పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారవుతుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల క్రమంలో వారి పేర్లు ఆ జాబితాలో ఉంటాయి. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది అభ్యర్థులు ఒకే మాదిరి మార్కులు సాధించినట్లయితే,  ఆ అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా వారి సీనియారిటీ నిర్ణయిస్తారు. వయసులో పెద్దవాడైన అభ్యర్థికి మెరిట్ లో ప్రాముఖ్యం ఇస్తారు.

Q2. What are the different reservations provided for the recruitment?
ప్రశ్న : రిక్రూట్ మెంటులో ఇవ్వబడిన వివిధ రిజర్వేషన్లేవి?

Ans. Reservation is provided to social categories like backward classes, Scheduled Castes& Scheduled Tribes. These reservations will be given to the candidates who are native of Andhra Pradesh only. 

In addition to social reservations, Women, Home guards, Meritorious Sports Person (MSP), National Cadet Corps (NCC), Children of Police Personnel(CPP),Children of Jail Personnel(CJP),Police Ministerial(PM), Police Executive(PE), also get reservation for various posts with different Quota in a horizontal manner. However, this reservation is different from social reservation in two ways- It is provided on Principle of Sufficiency &it is not carried forward for next recruitment.

జవాబు: సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ స్థానికులైన అభ్యర్థులకు మాత్రమే లభిస్తాయి.

సామాజిక రిజర్వేషన్లు మాత్రమే కాకుండా, మహిళలు, హోంగార్డులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎం.ఎస్.పి.), నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్.సీ.సీ), చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ (సి.పి.పి), చిల్డ్రన్ ఆఫ్ జైల్ పర్సనల్ (సి.జె.పి.), పోలీస్ మినిస్టీరియల్ (పి.ఎం.), పోలీస్ ఎగ్జీక్యూటివ్ (పి.యి.)లకు కూడా వివిధ కోటాల రిజర్వేషన్లు హారిజంటల్ పద్ధతిలో లభిస్తాయి. అయితే ఈ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లకు భిన్నమైనవి. ఈ తేడా రెండు విధాలు. ప్రిన్సిపల్ ఆఫ్ సఫీషియన్సీ ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ రిజర్వేషన్లు తర్వాతి రిక్రూట్ మెంటులో కొనసాగించడం జరగదు.

Q3. Out of total notified vacancies, how are the vacancies calculated under different categories?
ప్రశ్న: నోటిఫై చేసిన ఖాళీలలో వివిధ కేటగిరీలకు ఎన్ని పోస్టులన్నది ఎలా నిర్ణయిస్తారు?

Ans. In order to maintain uniformity & continuity in calculation of vacancies under OC,BC, SC & ST categories, a Hundred point roster is followed as per Rule-22 of A.P.State & Subordinate Service Rules,1996. From the starting roster point to the End roster point, numberof Vacancies under each category is calculated. The vacancies under BC,SC,ST Categories which couldn?t be filled up in previous recruitment are treated as Backlog vacancies and filled as such in next Recruitment.

జవాబు: ఓ.సి., బి.సి., యస్.సి., యస్.టీ. కేటగిరిలలో పోస్టులను లెక్కించడంలో యూనిఫామిటీ, కంటిన్యుటీ రెండు ఉండడానికి గాను 100 పాయింట్ల రోస్టర్ ను అనుసరించడం జరుగుతుంది. ఆంద్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996, రూల్ నెంబర్ 22 ప్రకారం ఈ రోస్టరును ను అనుసరిస్తూ లెక్కించడం జరుగుతుంది. రోస్టర్ పాయింట్ ప్రారంభం నుంచి రోస్టర్ పాయింట్ చివరి వరకు ప్రతి కేటగిరిలోను పోస్టుల సంఖ్యను లెక్కిస్తారు. అంతకు ముందు రిక్రూట్ మెంటులో బి.సి.,యస్.సి.,యస్.టీ. పోస్టుల ఖాళీలు భర్తీ కానట్లయితే వాటి సంఖ్యను బ్యాక్ లాగ్ గా లెక్కిస్తారు. వాటిని తర్వాతి రిక్రూట్ మెంటులో భర్తీ చేస్తారు.

Q4. What is horizontal reservation?
ప్రశ్న: హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి?

Ans. As defined in the order of Hon?ble Supreme Court of India in Rajesh Kumar Daria Vs State of Rajasthan ??.. , all reservation other than those under Article 15(3) of the constitution of India are to be treated as horizontal reservation. They should be filled up on principle of sufficiency with no carry forward.

జవాబు: రాజేష్ కుమార్ దారియా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాజ్యంగంలోని అధికరణ 15(3)లో ప్రస్తావించిన రిజర్వేషన్లు మినహా మిగిలిన రిజర్వేషన్లన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లుగా భావించాలి. వాటిని ప్రిన్సిపుల్ ఆఫ్ సఫీషియన్సీ ప్రకారం భర్తీ చేయాలి. ఈ రిజర్వేషన్ల బ్యాక్ లాగ్ కు క్యారీ ఫార్వార్డ్ ఉండదు.

Q5. How are the vacancies calculated under Horizontal reservation?
ప్రశ్న : హారిజాంటల్ రేజర్వేషన్లలో ఖాళీలను ఎలా లెక్కిస్తారు ?

Ans. SLPRB, AP follows the principle of horizontal reservation on compartmentalized basis. It means that the reservation is distributed among all social categories i.e. OC, BC,SC,ST as per the percentage fixed for horizontal reservation categories like Women, Home Guard,NCC,MSP,etc.,

జవాబు: హారిజాంటల్ రిజర్వేషన్లను SLPRB, AP కంపార్టుమెంటల్ పధ్ధతి పాటిస్తుంది. అంటే ఈ రిజర్వేషన్లను సామాజిక కేటగిరిల్లో పంచడం జరుగుతుంది. అంటే ఓ.సీ., బి.సీ., యస్.సీ., యస్.టీ. కేటగిరీల్లో హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరీలు అంటే మహిళలు, హోంగార్డులు, ఎన్.సీ.సీ, ఎం.యస్.పీ.,వగైరాలను పంపిణీ చేయడం జరుగుతుంది.  

Q6. What is the reservation for local candidates?
ప్రశ్న: స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు ఏవి?

Ans. As per the rules of AP Public Employment Act, 1975 and subsequent amendments, all the posts are divided into three categories:-

  1. State cadre
  2. Zonal cadre (Range cadre)
  3. District  cadre

For the district cadre, only OC 20% posts are available to all candidates as per their merit. The remaining 80% of posts will be filled by local candidates (Of District) Only.

For the Range cadre, only OC 30% of posts are available to all candidates as per their merit.  The remaining 70% of posts will be filled by local candidates (of Range) only.

For state cadre posts, all notified  vacancies will be filled up as per  Hundred Roster points as per Rule-22 of A.P. State & Subordinate Service Rules,1996. The Social Reservations will be given to the candidates who are natives of AP.

జవాబు: ఏ.పి. పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం 1975, దానికి చేయబడిన సంస్కరణల  ప్రకారం పోస్టులన్నీ మూడు కేటగిరీల్లో విభజంచడం జరిగింది.

ఎ. స్టేట్ కేడర్

బి. జోనల్ కేడర్

సి. జిల్లా కేడర్

జిల్లా కేడర్ కు మాత్రమే, ఓ.సీ.లో 20 శాతం పోస్టులు అభ్యర్థులందరికీ వారి మెరిట్ ఆధారంగా లభిస్తాయి. మిగిలిన 80 శాతం పోస్టులు స్ధానిక (జిల్లా) అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది.

రేంజ్ కేడర్ లో ఓ.సి.లో 30 శాతం పోస్టులు అభ్యర్థులందరికీ మెరిట్ ఆధారంగా లభిస్తాయి. మిగిలిన 70 శాతం పోస్టులు స్థానిక (రేంజ్) అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది.

స్టేట్ కేడర్ పోస్టులకు సంబంధించి, ఆంద్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996, రూల్ నెంబర్ 22 ప్రకారం రోస్టర్ లోని 100 పాయింట్ల లెక్కన భర్తీ చేయడం జరుగుతుంది. సామాజిక రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ స్థానికులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

Q7. How selection list is prepared from the Merit list?
ప్రశ్న: సెలెక్షన్ లిస్టులో మెరిట్ లిస్టు ఎలా తయారు చేస్తారు?

Ans. Backlog vacancies are subtracted from the total vacancies notified for direct recruitment,  to fill-up the vacancies for Direct Recruitment. No. of vacancies under each social category OC, BC-A,BC-B,BC-C,BC-D,BC-E,SC,ST will be calculated as per the starting roster point (which is the next roster point to the end roster point of previous recruitment). Within OC Category of posts, 2% of vacancies are reserved for Ex-servicemen as per availability of suitable candidates as per Rule-22 of A.P. State and Subordinate Service Rules,1996.

For district cadre posts, first OC 20% of posts will be  filled up as per Merit i.e., Open to all whether they are Local or Non-Local. While filling up of  such vacancies, Unit preference given by the candidate is considered. The remaining OC Vacancies will be filled up from local candidates only. (OC means Open Competition and not other categories).The Vacancies will be calculated as per the percentage given in the A.P Police (SCT) Rules,1999 reserved  to the  special categories i.e., Women , home guard, MSP, NCC, CDI, CPP, PE etc. If   numbers of candidates pertaining to special category are automatically selected as per their merit, as per the quota fixed, no more special category reservation is required. However, if less number of candidates belonging to special category   selected as per the merit, the remaining vacancies will only be filled up with most meritorious candidates of that special category by removing least meritorious candidate of OC Category. This process is repeated for all special categories. In case, eligible candidates of special category are not available, no change is made & the reserved vacancy for special category is not carried forward.

After filling up of OC vacancies, Backlog vacancies will be filled up for various social categories.

Finally, reservation quota for all BC, SC, ST categories will be filled up from local candidates of these categories. BC reservation is available only to Non-Creamy layer candidates. Again, in each of these, social categories, reservation for special categories will also be implemented exactly in the same manner as described above for OC.

          For range cadre posts, first OC 30% of posts will be filled. Remaining procedure is the same. For State Cadre posts, all OC vacancies are filled as per merit. Remaining procedure is the same.

జవాబు: డైరెక్ట్ రిక్రూట్ మెంటుకు నోటిఫై చేసిన మొత్తం ఖాళీల నుంచి బ్యాక్ లాగ్ ఖాళీల సంఖ్యను తీసేస్తారు. డైరెక్ట్ రిక్రూట్ మెంటులో ఖాళీలను భర్తీ చేయడానికి ఓ.సి., బి.సి-ఏ, బి.సి-బి, బి.సి- సి, బి.సి.-డి, బి.సి.-యి, యస్.సి., యస్.టీ. కేటగిరీల ఖాళీలను లెక్కిస్తారు. రోస్టర్ పాయింట్ ప్రారంభం (అంటే అంతకు ముందు రిక్రూట్ మెంటులో చివరి రోస్టర్ పాయింటు) నుంచి చివరి రోస్టర్ పాయింటు వరకు ఓ.సీ. కేటగిరిలో 2 శాతం మాజీ సైనికోద్యోగులకు ఆంద్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996, రూల్ నెంబర్ 22 ప్రకారం  అభ్యర్థులు అందుబాటులో ఉండడాన్ని బట్టి  రిజర్వేషను ఉంటుంది.

జిల్లా కేడర్ పోస్టుల విషయానికి వస్తే, మెరిట్ ప్రకారం మొదట 20 శాతం ఓ.సీ. కేటగిరి పోస్టులను భర్తీ చేస్తారు. అంటే, ఇవి స్ధానిక, స్థానికేతర అభ్యర్థులందరికీ ఓపెన్ పోస్టులు. ఈ ఖాళీలను పూరించడంలో అభ్యర్థికి యూనిట్ ప్రిఫరెన్స్ అవకాశాన్నిస్తారు. మిగిలిన ఓ.సీ. ఖాళీలన్నీ స్ధానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు (ఓ.సి. అంటే ఓపెన్ కాంపిటీషన్ అని భావం. అదర్ కేటగిరీ అని కాదు). ఏ.పి.పోలీస్ రూల్స్ (యస్.సి.టి) 1999 ప్రకారం స్పెషల్ కేటగిరీలు అంటే మహిళలు, హోంగార్డులు, ఎం.యస్.పీ., ఎన్.సీ.సీ., సి.డి.ఐ., సి.పి.పి., పి.యి. వగైరా ఖాళీలను లెక్కించడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరిలో రిజర్వేషను సంఖ్యలో అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికన ముందే ఎంపికై ఉంటే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ప్రత్యేకంగా అవసరం ఉండదు. అయితే, మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల సంఖ్య స్పెషల్ కేటగిరిలో రిజర్వేషన్ స్థానాల సంఖ్య కన్నా తక్కువ ఉంటే మిగిలిన స్థానాలను ఆ కేటగిరిలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంచుకోవడం ద్వారా భర్తీ చేస్తారు. సమాన సంఖ్యలో ఓ.సి. కేటగిరిలో తక్కువ మెరిట్ కలిగిన అభ్యర్థులను తొలగిస్తారు. ఇదే ప్రక్రియ స్పెషల్ కేటగిరిలన్నింటికి పాటించడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు దొరకనట్లయితే ఎలాంటి మార్పులు ఉండవు. స్పెషల్ కేటగిరిలకు రిజర్వు స్ధానాలను కేరీ ఫార్వార్డ్ చేయడం జరగదు.

ఓ.సి. ఖాళీలను భర్తీ చేసిన తర్వాత వివిధ సామాజిక కేటగిరీలకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

చివరిగా బి.సి.,యస్.సి.,యస్.టీ. కేటగిరిల రిజర్వేషన్ కోటా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ కేటగిరీలకు చెందిన స్ధానిక అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. బి.సి. రిజర్వేషన్లు కేవలం నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మాత్రమే లభిస్తాయి. సామాజిక కేటగిరీల్లో ప్రతి కేటగిరీలోను స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లను వర్తింపజేయడం జరుగుతుంది. పైన వివరించినట్లు ఓ.సీ. పోస్టుల భర్తీలో పాటించిన పద్ధతినే ప్రతి సామాజిక కేటగిరిలోను పాటించడం జరుగుతుంది.

రేంజ్ కేడర్ పోస్టుల విషయానికి వస్తే, ఓ.సి.లో 30 శాతం ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. మిగిలిన ఖాళీలకు పైన చెప్పిన పద్ధతినే పాటించడం జరుగుతుంది. స్టేట్ కేడర్ పోస్టుల్లో ఓ,సీ. ఖాళీలన్నీ మెరిట్ ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. మిగిలిన ఖాళీలకు పైన చెప్పిన పద్ధతినే పాటించడం జరుగుతుంది.

Q8. What is ABOST Reservation?
ప్రశ్న: ABOST రిజర్వేషన్లంటే ఏమిటి?

Ans. Schedule Tribes who are residing in the Scheduled areas  of five districts i.e., Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari & West Godavari districts are called as ABOST. Two types of reservation are available for them.

  1. 75% of the vacancies of Scheduled areas are filled by ABOST Candidates.
  2. For remaining ST Vacancies in these districts, if candidates of Normal Physical Measurement (i.e., Height and Chest for men & Height & Weight for Women) are not available, ABOST Candidates who get relaxation in PMT may be selected.

జవాబు: ఐదు జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని షెడ్యూల్డు ఏరియాల్లో నివసిస్తున్న షెడ్యూల్డు తెగలను ABOST అంటారు. వారికి రెండు రకాల రిజర్వేషన్లు లభిస్తాయి.

  1. షెడ్యూల్డు ఏరియాల్లో 75 శాతం ఖాళీలు ABOST అభ్యర్థులతోనే భర్తీ చేయడం జరుగుతుంది.
  2. ఈ జిల్లాల్లో మిగిలిన యస్.టీ. ఖాళీల్లో సాధారణ శారీరక కొలతలున్న (ఎత్తు, ఛాతీ పురుషులకు, ఎత్తు, బరువు స్త్రీలకు) అభ్యర్థులు లభించనట్లయితే శారీరక కొలతల విషయంలో మినహాయింపులు లభించిన ABOST అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది.